Karthika Deepam2 : కొత్త సీఈఓగా జ్యోత్స్న.. బాధలో దీప!
on Nov 26, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -212 లో.....శివన్నారాయణ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. తన నిర్ణయం చెప్తాడు. సంస్థ అంటే ఒక రెవెన్యూ కాదూ విలువలు కూడా ముఖ్యం.. అందుకే జ్యోత్స్న గ్రూప్ సంస్థకి జ్యోత్స్న నే న్యూ సీఈఓ గా చేస్తున్నానని శివన్నారాయణ అనగానే జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరు తన నిర్ణయానికి సరేనంటారు. కార్తీక్ మాత్రం ఇది నా సీఈఓ గా రాజీనామా పత్రం అని ఇస్తాడు. అలా ఎలా చేస్తారు. నేను దాన్ని ఒప్పుకొని మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని కార్తీక్ తో జ్యోత్స్న అంటుంది. ఎవరు లేకున్నా సంస్థ ఆగదంటు శివన్నారాయణ కార్తీక్ ని ఉద్దేశించి మాట్లాడతాడు.
మరొకవైపు దీప గది క్లీన్ చేస్తుంటే.. శౌర్యా మందుల చీటి కన్పిస్తుంది. అది తీసుకొని వెళ్లి కాంచనకి ఇచ్చి ఈ టాబ్లెట్ ఎందుకు వాడుతారని అడుగుతుంది. శౌర్య గురించి తెలిస్తే తట్టుకోలేదని బలానికి వాడతారు.. ఏ డాక్టర్ ని అడిగిన ఇదే చెప్తారని అనగానే.. ఏ డాక్టర్ ఎందుకు మీరు చెప్పారు కదా నేను నమ్ముతున్నానని దీప అంటుంది. ఆ తర్వాత కార్తీక్, జ్యోత్స్న ఇద్దరు మాట్లాడుకుంటారు. ఎందుకు బావ రిజైన్ చేసావ్.. నేను సీఈఓ అవడం ఇష్టం లేదా అని జ్యోత్స్న అడుగుతుంది. అదేం లేదని కార్తీక్ అనగానే జ్యోత్స్న రాజీనామా పత్రాన్ని చింపిస్తుంది.మనం ఒక్కటిగా పని చెయ్యాలని జ్యోత్స్న అనగానే.. దీప అన్న మాటలు గుర్తు వచ్చి సరే అంటాడు. ఈ న్యూ సీఈఓకి కంగ్రాట్స్ చెప్పవా అని జ్యోత్స్న అనగానే కార్తీక్ కంగ్రాట్స్ చెప్తాడు.
మరొకవైపు పారిజాతం స్వీట్ బాక్స్ తో దాస్ ఇంటికి వెళ్తుంది. మీ అన్న పోస్ట్ ఉడింది. సీఈఓ పోస్ట్ నుండి తీసేసారని పారిజాతం హ్యాపీగా ఫీల్ అవుతూ స్వప్నకి చెప్తుంది. ఏం జరిగిందని వాళ్లు అడుగగా.. జ్యోత్స్నని సీఈఓ చేశారని కార్తీక్ ని పారిజాతం తక్కువ చేసి మాట్లాడుతుంటే.. స్వప్న, కాశీలకి కోపం వస్తుంది. మరొకవైపు కార్తీక్ ఇంటికి వస్తాడు. మీటింగ్ లో జరిగింది చెప్తాడు. కార్తీక్ బాబు నన్ను పెళ్లి చేసుకోవడం వళ్లే ఇదంతా అని దీప ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read